ప్రయాణికుల రద్దీ దృష్ట్యా .. సికింద్రాబాద్ నుంచి కాకినాడతోపాటు తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్ నుంచి కాకినాడ మధ్య 28వ తేదీ రాత్రి 8 గంటలకు బయలుదేరి కాకినాడకు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా ఇదే రైలు మార్చి1న కాకినాడ నుంచి రాత్రి 8.50 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, నిడదవోలు, సామర్లకోట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైలు 28న సాయంత్రం 7.30 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి1న సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలుంటాయి.
ప్రత్యేక రైళ్లు నడపనున్న ద.మ.రైల్వే