కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పద్మ’ అవార్డులు పొందినవారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్‌కు ఎంపికైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును ప్రత్యేకంగా అభినందించారు. వ్యవసాయంలో వినూత్న సాగుపద్ధతులను అవలంబిస్తున్న రైతు చింతల వెంకట్‌రెడ్డి, సంస్కృత పండితుడు శ్రీభాష్యం విజయసారథి.. పద్మశ్రీ అవార్డుకు ఎంపికవడం సంతోషదాయకమన్నారు. ఈ ముగ్గురు తమతమ రంగాల్లో జాతికి గొప్ప సేవలు అందించి జాతీయస్థాయిలో పేరు పొందడంతోపాటు ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వీరందరూ పద్మ అవార్డులకు సరైన అర్హులని అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే సేవలందించినవారిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ‘పద్మ’ అవార్డులను పొందినవారికి కూడా ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.